సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రదర్శనలు, సమ్మెలు చేయకుండా నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్రపాలిత ప్రాంత సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ముకాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల (ప్రవర్తన) నిబం ధనలు 1971లోని నిబంధన 20(ఐ)ను ఉల్లంఘిస్తే చర్య లు తీసుకుంటామని హెచ్చరించింది. శుక్రవారం జారీ చేసిన ఈ ఉత్తర్వులపై తీవ్రస్థాయిలో విమర్శలు
వెళ్లువెత్తుతున్నాయి. 'జమ్ముకాశ్మీర్‌కు చెందిన ఏ ఉద్యోగి కూడా తన సర్వీస్, లేదా ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్‌కు సంబంధించిన ఏ విషయానికైనా సమ్మెను, ప్రదర్శనలను ఆశ్రయించకూడదు. ఏ విధంగానూ ప్రోత్సహించకూడదు' అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది కేవలం నిబంధనల యొక్క ప్రకటన కాదని, ఏ ఉద్యోగైనా ఇలాంటి చర్యల్లో పాల్గంటే కచ్చితంగా పరిణామాలను ఎదుర్కొంటారని ఉత్వరుల్లో వివరించారు.
ఈ ఉత్తర్వులు నియంతృత్వమే : సిపిఎం
ఈ ఉత్తర్వులను సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి నిర్ణయం నియంతృత్వమని, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) నిబంధనలను ఉల్లంఘించడమేనని విమర్శించింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, కుల్గాం మాజీ ఎమ్మెల్యే ఎంవై తరిగామి మాట్లాడుతూ ఇలాంటి నిర్ణయం భారతదేశం సభ్యురాలుగా ఉన్న ఐఎల్‌ఒ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. 'ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చనప్పుడు ప్రదర్శనలు, సమ్మెలకు దిగుతారు. తాజా ఉత్తర్వులు ఉద్యోగుల, కార్మికుల రాజ్యాంగ హక్కులపై మరో దాడి' అని తరిగామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పిడిపి అధ్యక్షులు, మాజీ సిఎం మెహబూబా ముఫ్తీ 'ఈ నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ నియంతృత్వ ఆలోచనా ధోరణిని తెలియజేస్తుంది' అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడం ఆమోదయోగ్యం కాదని, క్రమశిక్షణా చర్యలతో ఉద్యోగులను బెదిరించడం దారుణమని ముఫ్తీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.










