
బాలలూ, బాలలూ
భలే భలే బాలలూ...
ఆటలూ, పాటలూ
పాడుదాం పిల్లలూ..
వెలుగుపూలు పంచుదాం
నిద్రనుండి లేవండోరు
కలసిమెలసి సాగుదాం
పరుగులెత్తి రారండోరు
భరతభూమి పులకింపగ
గొంతులెత్తి పాడండోరు
తప్పుజేయు వారలకు
బుద్ధిజెప్ప కూడండోరు
మొక్కలెన్నో నాటుటకు
గుంతలెన్నో తవ్వండోరు
చింతలన్ని బాపుటకు
స్నేహితులై నవ్వండోరు
ఇరుగు పొరుగు బాగుకొరకు
మనసుపెట్టి మొక్కండోరు
చెడు యోచనలన్నింటిని
వెలికితీసి తొక్కండోరు...
- మీసాల చిన గౌరినాయుడు,
94928 48564.