
పాపా, బాబూ రారండి
బుద్ధిగ, చక్కగ కూర్చోండి
అ ఆ ఇ ఈ దిద్దండి
తెలుగు భాషను నేర్వండి
అ.. అమ్మ, ఆ..ఆవు అనండి
తెలుగు పుస్తకం చదవండి
బాల గేయాలు పాడండి
బాల కోకిలలు మీరండి
నీతి పద్యాలు నేర్వండి
మంచి పౌరులుగ ఎదగండి
బాలల కథలు చదవండి
బాగుగ వివేకం పొందండి
పొడుపు కథలు విప్పండి
తెలివిని మీరు పెంచండి
సామెతలెన్నో వినరండి
ఆమెత మీకది తెలియండి
సఖ్యతగా మీరు ఉండండి
స్నేహం విలువ ఎరుగండి
బంగరు బాలలు మీరండి
భావి భారతం మీదండి!
- జె.శ్యామల,
99896 01113