అమరావతి : నేడు (గురువారం) ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరై అసెంబ్లీలో సందడి చేశారు. అసెంబ్లీ లాబీల్లో బాలకృష్ణను చూడగానే మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, అమర్నాథ్‌లు పలకరించారు. మంత్రి బొత్స 'ఏం హీరో గారు' అంటూ బాలయ్యకు అభివాదం చేశారు. ఇక బాలకృష్ణ మంత్రి అమర్నాథ్‌ను ఉద్దేశించి 'ఇవాళ కోటు వేసుకు రాలేదే' అంటూ ఆయన్ని చమత్కరించారు. బడ్జెట్ సమావేశాల్లో హీరో బాలకృష్ణ ఎంట్రీతో అక్కడ అంతా సందడి వాతావరణం నెలకొంది.










