Nov 21,2023 17:24

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐపిఎల్‌ తర్వాత స్పోర్ట్స్‌ లీడ్‌ ప్రో కబడ్డీ బాగా ప్రాచుర్యం పొందింది. ఐపిఎల్‌ తరహాలో ఫ్రాంచైజ్‌లు వేసి రాష్ట్రాల వారీగా టీంలను డివైడ్‌ చేస్తారు. ఈ లీగ్‌లో అన్ని దేశాలకి చెందిన కబడ్డీ ఆటగాళ్లు పాల్గొంటారు. అందుకే ఈ లీగ్‌ ప్రజాదరణ పొందింది. డిసెంబర్‌ 2న ప్రారంభం కానున్న ప్రో కబడ్డీ ప్రమోషన్స్‌ కోసం స్టార్స్‌ రంగంలోకి దిగారు. ఇప్పటికే శ్రీలీలతో ఒక ప్రోమో విడుదలైంది. అలాగే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ప్రమోషన్‌ వీడియో రిలీజైంది. ఈ వీడియో సినిమా ట్రైలర్‌ మాదిరిగా ఉంది. ఈ వీడియోను తన ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పోస్టు చేశారు. ఈ వీడియోకు 'కబడ్డీ మన మట్టిలో పుట్టిన ఆట. మన తెలుగు వాడి పౌరుషాన్ని తెలిపే ఆట. కండల బలమే ఆయుధంగా.. మైదానమే రణస్థలంగా పోరాడే ఈ దమ్మున్న ఆటను అస్సలు మిస్‌ కావద్దు అనే క్యాప్షన్‌ పెట్టారు.