Mar 16,2023 21:20

న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో సరికొత్త ఫీచర్లతో 2023 బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌200, ఎన్‌ఎస్‌ 160 స్ట్రీట్‌ మోడళ్లను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద వీటి ధరలను వరుసగా రూ.1.47 లక్షలు, రూ.1.35 లక్షలుగా నిర్ణయించింది. కొత్త ఎన్‌ఎస్‌డి ఫోర్క్‌, డ్యూయల్‌ చానల్‌ ఎబిఎస్‌ ప్రత్యేక ఫీచర్లుగా ఉన్నాయని పేర్కొంది. ఇంతక్రితం మోడల్‌తో పోల్చితే ఎన్‌ఎస్‌ 200 వేరియంట్‌ 1.5 కిలోలు తక్కువ బరువు ఉందని ఆ కంపెనీ తెలిపింది. ఎన్‌ఎస్‌200ను 200 సిసి ఇంజిన్‌తో 24.5 బిహెచ్‌పితో విడుదల చేసింది. ఆరు గేర్ల స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో దీన్ని రూపొందించడం విశేషం.