
ప్రజాశక్తి - జామి : అసమానతలు లేని అభివృద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కారానికి సిపిఎం చేపడుతున్న ప్రజా రక్షణ భేరి జాతా జామి మండలం బీమసింగి సుగర్ ఫ్యాక్టరీ మీదుగా జామి మండల కేంద్రానికి చేరుకుంది. సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్ ఆధ్వర్యంలో ప్రజా రక్షణ భేరి జాతాకు అంగన్వాడీ, ఆశా, మధ్యహాన్న భోజన కార్మికులు, చెరుకు రైతులు స్వాగతం పలికారు. బీమసింగి సహకార చక్కెర కర్మాగారం మూసివేత తో ఈ ప్రాంత చెరుకు రైతులకు తీవ్ర అన్య్యాయం జరిగిందని, తక్షణమే ఫ్యాక్టరీ తెరిపించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, జాతా నాయకత్వానికి వినతి పత్రాన్ని రైతులు అందజేశారు. అలాగే అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ, నిత్యావసర ధరలు తగ్గించి ప్రజానీకాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధర రూ.400, పెట్రోల్, డీజిల్ ధరలు రూ.60 లకే అందించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకులు రేసన్ ద్వారా అందించాలని, వాటికి గల ప్రత్యామ్నాయ మార్గాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కోసం తప్ప పేదల కోసం పని చేయడం లేదని ఆరోపించారు. ఎన్నికల ముందు హామి లు గుప్పించిన బిజెపి, ఎనిమిదేళ్ళ అధికారంలో వాటికి తుంగలో తొక్కిందని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు కేంద్రం తాన తందాన ఆటలో పావులుగా మారాయని అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బుద్దరాజు రాంబాబు మాట్లాడుతూ, జామి లో అగ్రహారం భూ సమస్యను పరిష్కరించి, సాగులో ఉన్న రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వై వేంకటేశ్వరులు, రైతులు, కార్మికులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-------------------------0000000000000---------------------------
విజయనగరం జిల్లా కేంద్రం
ప్రజాశక్తి - విజయనగరం టౌన్ : సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రకు విజయనగరం జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం పలికారు. సిపిఎం ఆధ్వర్యంలో భోగాపురం నుంచి విజయనగరంలోకి ప్రవేశించిన బస్సు యాత్రకు గుమ్చి వద్ద ఘన స్వాగతం పలికారు.సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు ఆధ్వర్యంలో బస్సు యాత్ర ద్వారా వచ్చిన సిపిఎం రాష్ట్ర నాయకులకు ఎర్ర తిలకం దిద్ది స్వాగతం పలికారు. అనంతరం కోలాటం, డప్పు వాయిద్యాల నడుమ కోట జంక్షన్ బహిరంగ సభ వేదిక వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అసమానతలు లేని అభివృద్ది కోసం సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు బస్సు యాత్ర లు చేపట్టడం జరిగింది అన్నారు. మేము చేపట్టిన బస్సు యాత్ర ఓట్లు కోసం కాదని, రాష్ట్ర ప్రజలు కోసం చేపట్టిన యాత్ర అన్నారు. కేంద్రంలో బిజెపి 9 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని అమలు చేయని బిజెపికి వ్యతిరేకంగా వైసిపి, టిడిపిలు నిలబడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఈ డి,సి బి ఐ లను ఉసిగొల్పి భయపెట్టే ధోరణిలో మోడీ ప్రభుత్వం ఉందన్నారు. దేశాన్ని తాకట్టు పెట్టే, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసే, కార్మిక హక్కులను కాలరాసే ,కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే బిజెపికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ది కోసం పోరాడుతున్న సిపిఎం వెంట ప్రజలు నడవాలని ఆయన పిలుపనిచ్చారు.

వెనుకబడిన విజయనగరం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం
రాష్ట్రంలో ప్రజలు అసమానతలు లేని అభివృద్ది ఉండాలని సిపిఎం కోరుకుంటున్నది అందుకోసమే బస్సు యాత్ర చేపట్టడం జరిగింది అన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రెండు కోట్లు ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నా మోడీ ఇచ్చిన హామీ అమలు చేయకుండా మోసం చేశారన్నారు. రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరో 40,000 ఉపాద్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎందుకు భర్తీ చెయ్యరని ప్రశ్నించారు. కనీస వేతనం 26000 ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. సిపిఎం 26000 కనీస వేతనం కోసం పోరాడుతూనే ఉంటుందన్నారు. ఇంటి పన్ను,చెత్త పన్నులు వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు నడ్డి విరుస్తున్నయని అన్నారు. సిఎం తర్వాత స్థానం నాదే అని చెప్పుకుంటున్న జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి, తోటపల్లి, తామతీర్ తీర్థ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు తెలేకపోయారని ప్రశ్నించారు. పేదలకు ప్రభుత్వమే ఇంటి స్థలాలు ఇచ్చి, 5 లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మాణాలు చేయాలని సభ ద్వారా డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడిన విజయనగరం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీ కి నిధులు ఇవ్వాలని, గురజాడ సాంస్కృతిక కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే అది ఎర్ర జెండా ద్వారానే సాధ్యమని, ఎర్ర జెండా బలపడితెనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ దిశగా ప్రజలు ఎర్ర జెండాను ఆదరించాలని కోరారు.

మోడీ,జగన్ పాలనపై మండిపడ్డ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ వి నాగేశ్వరరావు
కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రెండు పేదలపై భారాలు వేసి కార్పొరేటర్లు లాభాలు వచ్చే విధంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విద్యా, వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు . ఈ రెండు రంగాల్లో పేదలకు ఆన్యాయం జరుగుతుందన్నారు . జాతీయ విద్యా విధానం పేరుతో విద్యా రంగంలో అనేక మార్పులు తెచ్చి విలీనం పేరుతో ఇప్పటికే 3 వేలు స్కూళ్లు మూసేయడం జరిగిందన్నారు. రానున్న కాలంలో మరో 40 వేలు స్కూళ్లు మూసేయడానికి ప్రభుత్వాలు సిద్దంగా ఉన్నాయన్నారు. మెరుగైన విద్యా,వైద్యం అందించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. వైద్యం నేడు టాబ్ లకే పరిమితం అవుతుందన్నారు. వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనం లేక వెట్టి చాకిరికి గురి అవుతున్నారని అన్నారు. వైద్య రంగంలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ల నుంచి కార్మికులు నిజ వేతనాలు పడి పోయాయన్నారు.13 ఏళ్లుగా కనీస వేతనాలు లో సవరణ లేదన్నారు. బానిసలుగా పని చేయించుకొని చాలీ, చాలని వేతనాలతో బతకల్సివస్తుందన్నారు. అన్ని రంగాల్లో పని చేస్తున్న వారికి, స్కీమ్ వర్కర్లకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని సభ ద్వారా డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రభావతి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ జోడీలు ప్రజలను మోసం చేస్తూ పాలిస్తున్నయన్నరు. నిరుపేదలకు అండగా లేని ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాలు అన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్ పెట్టీ ఎన్నికల తర్వాత అమలులోకి వస్తుందని చెప్పి ద్వంద వైఖరి తో బిజెపి వ్యవహరిస్తోందన్నారు. దేశంలో,రాష్ట్రంలో మహిళకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళల కు సమన హక్కులు కోసం,అసమానతలు రూపు మాపేందుకు, ఎటువంటి అసమానతలు లేని అభివృద్ది కోసం సిపిఎం చేసే పోరాటంలో ప్రజలు మహిళలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ సిపిఎం గా స్థానిక సమస్యలపైన,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం నిరంతరం పోరాడుతూనే ఉందన్నారు. విజయనగరం జిల్లా అభివృద్ది కాక పోవడానికి కారణం పాలకులు నిర్లక్ష్యమే కారణమని అన్నారు. జిల్లాలో పరిశ్రమలు మూతపడిన, ప్రభుత్వ పరిశ్రమలు అమ్మేస్తున్నా మంత్రి బొత్సకు అవసరం లేదన్నారు. వాళ్ళ స్వార్థం తప్ప ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు సమస్యలు పాలకులకు పట్టడం లేదన్నారు. మన సమస్యలు పరిష్కారం కోసం మనమే పోరాడాలని,ఎటువంటి పోరాటాలు నిర్వహించే సిపిఎం అండగా ప్రజలు నిలబడాలని పిలుపునిచ్చారు.బస్సు యాత్ర ముగింపు సందర్భంగా నవంబర్ 15 న విజయవాడలో జరగనున్న భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి వెలాధిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సభకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు పి.రమణమ్మ వందన సమర్పణ తో సభ ముగిసింది.అంతకు ముందు బస్సు యాత్ర తో వచ్చిన ప్రజా నాట్యమండలి కళారూపాలు,విప్లవ గేయాలు,ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిర్వహించిన నాటికలు ఆకట్టుకున్నాయి.

సిపిఎం బృందానికి ప్రజాసంఘాలు నుంచి వినతలు...
సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రకు జిల్లాలోని పలు ప్రజా సంఘాలు వారి సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హీల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు , నాయకులు , అశా కార్యకర్తలు యూనియన్ నాయకులు,వి ఆర్ ఎ లు, డి వై ఎఫ్ ఐ,ఎస్ ఎఫ్ ఐ, ఎపి బెవరేజ్ సంఘం నాయకులు,ఆర్టీసి అద్దె బస్సు డ్రైవర్లు,ఆటో డ్రైవర్లు సంఘాలు నాయకులు,
నెల్లిమర్ల,విజయనగరం మున్సిపల్ కార్మికులు,
ఎల్ బి జి నగర్,గురజాడ నగర్,రామకృష్ణ నగర్, బానమెట్ట,సుందరయ్య కాలనీ,సమస్యలపై బస్సు యాత్రకు వచ్చిన సిపిఎం రాష్ట్ర నాయకులు బృందానికి వినతి పత్రాలు అందజేశారు.
బస్సు యాత్ర సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి వి రమణ,వి.లక్ష్మి,సిపిఎం నాయకులు,కార్యకర్తలు ప్రజలు,కార్మికులు,స్కీమ్ వర్కర్ల,విద్యార్దులు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
