వసంతమే వచ్చిందని
కోయిలమ్మ కూస్తుంది
వానజల్లు పడనుందని
నెమలి నాట్యమాడుతుంది
నల్లని మేఘాలు తొలగి
ఇంద్ర ధనస్సు మెరుస్తుంది
చినుకులందు తడిచిన
విత్తనమే మొలుస్తుంది
విరబూచిన పువ్వు చెంత
తుమ్మెద తిరుగాడుతుంది
దోరకాయ దొరికితేనే
చిలకమ్మ కొరుకుతుంది
నాన్న చెంత నుంటేనే
చిన్ని పాప నవ్వుతుంది
అమ్మ బువ్వ పెట్టగానే
మారామెంతో చేస్తుంది
అన్నతోటి ఆటలాడి
అలసి సొలసి పోతుంది
అమ్మమ్మ కథలు చెప్ప
వింటూ నిదురపోతుంది !
- కూచిమంచి నాగేంద్ర
91821 27880










