Aug 27,2023 06:47
  • హోరాహోరీ సెమీస్‌లో ఓటమి 

కొపెన్‌హగెన్‌(డెన్మార్క్‌): ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ కాంస్య పతకానికే పరిమితమయ్యాడు. శనివారం జరిగిన మూడుసెట్ల హోరాహోరీ పోటీలో ప్రణయ్ 21-18, 13-21, 14-21తో 3వ సీడ్‌, థాయ్ లాండ్‌కు చెందిన విదిత్‌శరణ్‌ చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌ను ఉత్కంఠ పోటీలో నెగ్గిన ప్రణరు రెండో గేమ్‌లోనూ ఓ దశలో 7-7పాయింట్లతో సమంగా నిలిచాడు. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోయి 8-11పాయింట్లతో వెనుకబడ్డాడు. ఆ తర్వాత అలసటకు గురై 13-21తో గేమ్‌ను చేజార్చుకున్నాడు. మూడో, నిర్ణయాత్మక గేమ్‌లోనూ తొలుత ఒత్తిడి లోనైన ప్రణయ్ 7-11పాయింట్లతో వెనుకబడ్డాడు ఆ తర్వాత 13-15పాయింట్లతో పోరాడినట్లు కనిపించినా.. 3వ ర్యాంకర్‌ విదిత్‌.. వరుసగా పాయింట్లు సాధించి ఆ గేమ్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌ సుమారు గంటా 16నిమిషాలసేపు సాగింది. దీంతో విదిత్‌ ఫైనల్‌కు చేరాడు. దీంతో సెమీస్‌లో ఓడిన ఇరువురు షట్లర్లకు కాంస్య పతకాలు దక్కనున్నాయి. దీంతో భారత అగ్రశ్రేణి షట్లర్లకు అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకం ప్రణయ్ సొంతమైంది.శుక్రవారం ప్రణరు టాప్‌సీడ్‌ అక్సెల్సన్‌(డెన్మార్క్‌)పై సంచలన విజయం సాధించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో ప్రణయ్ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ను 13-21, 21-15, 21-16 తేడాతో ఓడించి సెమీస్‌కు చేరాడు. ఇక గత ఏడాది పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఈసారి క్వార్టర్స్‌లో భారత జోడీ 18-21, 19-21తో డెన్మార్క్‌ జంట చేతిలో ఓడారు.