
హైదరాబాద్ : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ... శనివారం గన్ పార్క్ వద్ద ప్రవీణ్ కుమార్ సత్యాగ్రహ దీక్షను తలపెట్టిన నేపథ్యంలో ... పోలీసులు ముందుగా ప్రవీణ్ కుమార్‌ను కలిసి దీక్ష వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనను పోలీసులు ఇంట్లోనే అడ్డుకొని గృహనిర్బంధం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలను ఇంట్లోకి అనుమతించడం లేదు. దీంతో ఇంట్లోనే తన దీక్షను కొనసాగిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని అన్నారు.