Oct 28,2023 21:16

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బిఎస్‌ఎన్‌ఎల్‌ వచ్చే డిసెంబర్‌ నుంచి 4జి సేవలను అందుబాటులోకి తేనుందని ఆ సంస్థ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పికె పూర్వార్‌ తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతన్న ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 జూన్‌ కల్లా దేశ వ్యాప్తంగా 4జి సేవలను అందించనున్నామని పేర్కొన్నారు. తొలుత పంజాబ్‌ నుంచి ఈ సేవలు ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే 200 ప్రదేశాల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించామన్నారు. దశల వారీగా ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తామని చెప్పారు. 4జి నెట్‌వర్క్‌ను 5జికి అప్‌గ్రేడ్‌ చేసే బాధ్యతను దిగ్గజ ఐటి కంపెనీ టిసిఎస్‌, ప్రభుత్వ రంగ ఐటిఐకి అప్పగించామన్నారు. 5జి సేవల కోసం స్పెక్ట్రం కూడా అందుబాటులో ఉందన్నారు.