Aug 06,2023 12:40

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ : అమఅత్‌ భారత్‌ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 502 రైల్వే స్టేషన్లను అభివఅద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ స్టేషన్‌ అభివఅద్ధి చేసేందుకు ప్రణాళికల సిద్ధం అయ్యాయి. ఆదివారం ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రధాని మోడి వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశము ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి వేణు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రాంకుమార్‌ హాజరవ్వగా వీరితో పాటు నాయకులు తప్ప మిగిలిన కాకినాడ ప్రజలెవ్వరూ ఈ కార్యక్రమానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇందుకు కారణం బిజెపిలో ఉన్న అంతర్గత వర్గ పోరు అని.. కేవలం నగరంలో ఈ కార్యక్రమానికి సంబంధించి బిజెపి కింది స్థాయి నాయకులకు కూడా సమాచారం ఇవ్వలేదని తెలుస్తుంది. ప్రతి కార్యక్రమానికి పదిమందికంటే తక్కువగానే బిజెపి నాయకులు హాజరవుతారని, మిగతా నాయకులకు ఎలాంటి కార్యక్రమాలు జరిగినప్పటికీ చెప్పకుండా ఉంటారని తెలుస్తుంది. ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నాయకులు కూడా పూర్తి అసంతఅప్తితో ఉన్నారని పలువురు బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంత పెద్ద కార్యక్రమాన్ని కేవలం 100 మందిని కూడా పిలవలేని స్థితిలో కాకినాడ బిజెపి నాయకులు ఉన్నారని పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.