Nov 08,2023 14:45

పాలకొల్లు : ఈనెల 15 న ఛలో విజయవాడకు పిలుపు నిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా రక్షణ భేరి బస్ యాత్ర బుధవారం పాలకొల్లు విచ్చేసింది. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కళాకారులు పలు గేయాలు ఆలపించారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వివిధ ట్రేడ్ యూనియన్ లకు చెందిన నేతలు, కార్మికులు ప్రజారక్షణ భేరీలో భారీగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి కి ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం ప్రజలు, అన్ని రంగాల నేతలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి నిర్వీర్యం చేసిందని చెప్పారు. బొగ్గు గనులను అదాని, అంబానీ లకు కట్టబెట్టడం తో తిరిగి వారి వద్ద నుంచి బొగ్గు కొనుగోలు చేయడంతో రేటు పెరగడంతో దేశంలో కరెంట్ ఛార్జీలు దారుణంగా పెరిగాయని చెప్పారు. ఇలా సామాన్య ,మధ్యతరగతి ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో విలవిలలాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పన్నులు కూడా పెరిగి ఉఫాధి లేక విలవిల్లాడుతున్నారని చెప్పారు. వేదిక వద్ద పుచ్చలపల్లి సుందరయ్య,డా బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు రాష్ట్ర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

senior cpm leaders

సీనియర్ నేతలకు సత్కారం
పాలకొల్లుకు చెందిన సీనియర్ సిపిఎం నేతలు వలవల శ్రీరామమూర్తి, యర్రా కృష్ణారావు, అరటికట్ల నారాయణమ్మ లను రాష్ట్ర నేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోక్ నాధం మాట్లాడుతూ పోరాటాల పురిటిగడ్డ అయిన పాలకొల్లులో వీరు చేసిన పోరాట పటిమను శ్లాఘించారు. ఇంకా మరో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి బి బలరాం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజారామ్ మోహన్ రాయ్, రాష్ట్ర మహిళా నేత ధనలక్ష్మీ, మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్, బాతిరెడ్డి జార్జి,దేవ సుధాకర్, యర్రా అజయ్,టి కోటేశ్వరరావు,రాయపరాజు, నరసాపురం నేతలు కవురు పెద్దిరాజు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు .