Mar 04,2023 21:28

యశోద హాస్పిటల్‌ వైద్యుల వెల్లడి
హైదరాబాద్‌ : ముత్ర పిండాల వ్యాధులపై ప్రజలకు అవగాహన తప్పనిసరి అని యశోద హాస్పిటల్స్‌ వైద్యులు పేర్కొన్నారు. ''ప్రపంచంలో దాదాపు 85 కోట్ల ప్రజలు ఏదో ఒక మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నారు. ప్రజల్లో మూత్రపిండాల వ్యాధులపైన, మూత్రపిండాల ఆరోగ్యం పైన అవగాహన పెంపొందించడానికి ప్రతి సంవత్సరం మార్చి నెలలో 2వ గురువారాన్ని ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో యశోద హాస్పిటల్స్‌ ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిడ్నీ దానం చేసిన 50 మందికి పైగా కిడ్నీ దాతలను ఘనంగా సత్కరించడం సంతోషంగా ఉంది.'' అని యశోద హాస్పిటల్స్‌, సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ రాజశేఖర చక్రవర్తి అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌, పద్మభూషణ్‌ డాక్టర్‌ ఎంకె మణి మాట్లాడుతూ.. భారతదేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోవడం ఆందోళనకరమన్నారు. మన దేశ జనాభాలో 17 శాతం మంది ప్రజలు మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏకైక మార్గం ప్రజలకు కిడ్నీ వ్యాధులపై అవగహన కల్పించడమేనని సూచించారు.