హైదరాబాద్ : వైద్య బీమాపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎఫ్‌టిసిసిఐ ఏర్పాటు చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ విజన్ 2030లో గవర్నర్ మాట్లాడుతూ.. విద్యా వంతుల్లోనూ ఇప్పటికీ వైద్య బీమాపై అవగాహన కొరవడిందన్నారు. 2030 నాటికి అందరికీ ఇది అందుబాటులోకి రావాలని ఆకాక్షించారు. రోగం వచ్చినప్పుడు వైద్య బీమా ఉంటే ఆర్థిక రక్షణ పొందవచ్చన్నారు. ఎఫ్‌టిసిసిఐ దీనిపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని గవర్నర్ సూచించారు. మెరుగైన వైద్యం పొందడం కూడా ఒక హక్కు అని పేర్కొన్నారు. బీమా అమలు సమయంలో ఏవైనా చిన్న పొరపాట్టు ఉన్నప్పటికీ రోగులకు సాయం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎఫ్‌టిసిసిఐ ప్రతినిధులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.










