ప్రజాశక్తి -కారంచేడు(బాపట్ల) : బాపట్ల జిల్లాకారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి సచివాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమతెరలు వాడాలని, ప్రజారోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులని దోమకాటు పెనుముప్పు దోమలు పుట్టకుండా కుట్టకుండా చేద్దాం ,ఆరోగ్యంగా జీవిద్దాం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, అంటూ ఆరోగ్య సిబ్బంది నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ బయ్య శంకర్, ఆశా కార్యకర్తలు పిహెచ్సి సిబ్బంది స్టాఫ్ నర్స్ లు మల్లేశ్వరి, క్షీర వర్ధిని, ఎల్. టీ.శంకర్, స్థానిక సర్పంచ్ మోటాని మధుసూదన్ రావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










