ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : న్యాయం చేయాలంటూ ... ఆటో డ్రైవర్ రెవెన్యూ కార్యాలయంలోని టవర్‌ను ఎక్కి ఆందోళన చేసిన ఘటన శుక్రవారం నరసాపురంలో జరిగింది. నరసాపురం నుండి నాగాయలంకకు వెళుతున్న అవనిగడ్డ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఉండి మెయిన్ సెంటర్లో ఆటోను ఢీకొట్టడంతో ఆటో స్వల్పంగా దెబ్బతింది. ఈ విషయమై ఆటో డ్రైవర్ బస్సు డ్రైవర్ తో ఘర్షణకు దిగగా, స్థానిక పోలీసులు పోలీసు స్టేషనుకు బస్సును, ఆటోను తరలించారు. ఆటోడ్రైవర్ తనకు అన్యాయం జరిగిందని రెవెన్యూ కార్యాలయంలోని టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్ దువ్వి సూరిబాబును స్థానికుల సహాయంతో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వి.ఆంజనేయులు టవర్ నుంచి కిందకు దింపారు. బస్సు డ్రైవర్‌ను, ఆటో డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన ఎఎస్‌ఐ అడబాల శ్రీనివాసరావు పైన కేసు నమోదు చేయిస్తామని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ హామీ ఇచ్చారు.