
25 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు హెడ్, వార్నర్ ఇద్దరూ తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డేవిడ్ వార్నర్ 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 81 పరుగులు చేయగా.. హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ ఉన్నారు.
- 13 ఓవర్లకు ఆస్ట్రేలియా 144
13 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 144 పరుగులు చేసింది. గాయం తరువాత జట్టులో చేరిన ట్రవిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చేలరేగి ఆడుతున్నాడు. ట్రవిస్ హెడ్ 37 బంతుల్లో 71, డేవిడ్ వార్నర్ 43 బంతుల్లో 63 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు.
- టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్..
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ధర్మశాల వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగినట్లు కివీస్ సారథి టామ్ లాథమ్ తెలిపాడు. మార్క్ చాప్‌మన్ పిక్కల్లో నొప్పితో దూరంకాగా.. అతడి స్థానంలో జిమ్మీ నీషం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో కామెరాన్ గ్రీన్ స్థానంలో ట్రవిస్ హెడ్ తుదిజట్టులోకి వచ్చాడని అని తెలిపాడు.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.