Sep 06,2023 13:26

సిడ్నీ: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ టోర్నీ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా(సిఎ) తమ జట్టును ప్రకటించింది. సిఏ ప్రకటించిన 15మంది ఆటగాళ్ల జట్టులో యువ ఆల్‌రౌండర్‌ ఆర్డోన్‌ హార్డీ, తన్వీర్‌ సంఘాతోపాటు పేసర్‌ నాథన్‌ ఎల్లిస్‌కు చోటు దక్కలేదు. అలాగే టెస్టు స్పెషలిస్టు మార్నస్‌ లబూషేన్‌ పేరును పరిశీలించని సిఏ.. పేసర్‌ అబాట్‌కు చోటు కల్పించింది. కెప్టెన్‌గా పాట్‌ కమిన్స్‌ ఎంపికయ్యాడు. ఈనెల సెప్టెంబరు 28వరకు ప్రపంచకప్‌ జట్టులో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రపంచకప్‌ 2023కు ముందు దక్షిణాఫ్రికా, భారత్‌తో ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఇక భారత్‌ వేదికగా అక్టోబరు 5 నుంచి మెగా ఈవెంట్‌ మొదలుకానుండగా.. అక్టోబరు 8న టీమిండియాతో ఆసీస్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా అత్యధికంగా 5సార్లు చేజిక్కించుకుంది.
ఆస్ట్రేలియా ప్రపంచ కప్‌ జట్టు ఇదే : 1.పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), 2.స్టీవ్‌ స్మిత్‌, 3.అలెక్స్‌ కేరీ, 4.జోష్‌ ఇంగ్లిస్‌, 5.సీన్‌ అబాట్‌, 6.అష్టన్‌ అగర్‌, 7.కెమెరూన్‌ గ్రీన్‌, 8.జోష్‌ హేజిల్‌వుడ్‌, 9.ట్రావిస్‌ హెడ్‌, 10.మిచెల్‌ మార్ష్‌, 11.గ్లెన్‌ మాక్స్‌వెల్‌, 12.మార్కస్‌ స్టోయినిస్‌, 13.డేవిడ్‌ వార్నర్‌, 14.ఆడమ్‌ జంపా, 15.మిచెల్‌ స్టార్క్‌.