Oct 13,2023 09:31
  • 134 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు

లక్నో: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియా జట్టు మరో ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టు 134 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 311పరుగులు చేయగా.. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ ఓటమికి ఫీల్డర్లు వదిలేసిన ఆరు క్యాచ్‌లే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తొలుత దక్షిణాఫ్రికాను ఓపెనర్లు డికాక్‌, కెప్టెన్‌ బవుమా సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 108 పరుగులు జతచేశారు. ఈ క్రమంలో కెప్టెన్‌ బవుమా వ్యక్తిగత స్కోర్‌ 35 పరుగుల వద్ద ఔట్యఆ్యడు. ఆ తర్వాత డికాక్‌(109) సెంచరీకి తోడు మార్క్‌క్రమ్‌(56) అర్ధసెంచరీతో మెరిసాడు. జట్టు స్కోర్‌ 197 పరుగుల వద్ద డీకాక్‌ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. చివర్లో క్లాసెన్‌(29), జెన్సన్‌(26) కూడా బ్యాట్‌ ఝుళిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు రెండేసి, హేజిల్‌ వుడ్‌, కమిన్స్‌, జంపాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్‌ మిఛెల్‌ మార్ష్‌(7) వికెట్‌ను త్వరగా కోల్పోయింది. వార్నర్‌(13), స్మిత్‌(19)కి తోడు ఇంగ్లీస్‌(5), మ్యాక్స్‌వెల్‌(3), స్టొయినీస్‌(8) సింగిల్‌ డిజిట్‌కే పెవీలియన్‌కు చేరారు. దీంతో ఆసీస్‌ జట్టు 70 పరుగులకే 6వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో నిలిచింది. లబూషేన్‌(46) టాప్‌ స్కోరర్‌. చివర్లో స్టార్క్‌(27), కమిన్స్‌(22) రెండంకెల స్కోర్‌ చేశారు. రబడాకు మూడు, మహరాజ్‌, షాంసీ, జెన్సన్‌కు రెండేసి, ఎన్గిడికి ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ డికాక్‌కు లభించింది.
వన్డే ప్రపంచకప్‌లో నేడు..
న్యూజిలాండ్‌ × బంగ్లాదేశ్‌
(వేదిక: చెన్నై; మ.2.00గం||లకు)
 

స్కోర్‌బోర్డు..
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి)మ్యాక్స్‌వెల్‌ 109, బవుమా (సి)వార్నర్‌ (బి)మ్యాక్స్‌వెల్‌ 35, డుస్సెల్‌ (సిాసబ్‌)అబాట్‌ (బి)జంపా 26, మార్క్‌క్రమ్‌ (సి)హేజిల్‌వుడ్‌ (బి)కమిన్స్‌ 56, క్లాసెన్‌ (సి)ఇంగ్లీస్‌ (బి)హేజిల్‌వుడ్‌ 29, మిల్లర్‌ (బి)స్టార్క్‌ 17, జెన్సన్‌ (సి)వార్నర్‌ (బి)స్టార్క్‌ 26, రబడా (నాటౌట్‌) 0, మహరాజ్‌ (నాటౌట్‌) 0, అదనం 13. (50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 311పరుగులు.
వికెట్ల పతనం: 1/108, 2/158, 3/197, 4/263, 5/267, 6/310, 7/311

బౌలింగ్‌ : స్టార్క్‌ 9-1-53-2, హేజిల్‌వుడ్‌ 9-0-60-1, మ్యాక్స్‌వెల్‌ 10-1-34-2, కమిన్స్‌ 9-0-71-1, జంపా 10-0-70-1, మిచెల్‌ మార్ష్‌ 1-0-6-0, స్టొయినీస్‌ 2-0-11-0

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : మిఛెల్‌ మార్ష్‌ (సి)బవుమా (బి)జెన్సన్‌ 7, వార్నర్‌ (సి)డుస్సెన్‌ (బి)ఎన్గిడి 13, స్టీవ్‌ స్మిత్‌ (ఎల్‌బి)రబడా 19, లబూషేన్‌ (సి)బవుమా (బి)మహరాజ్‌ 46, ఇంగ్లీస్‌ (బి)రబడా 5, మ్యాక్స్‌వెల్‌ (సి అండ్‌ బి) మహరాజ్‌ 3, స్టొయినీస్‌ (సి)డికాక్‌ (బి)రబడా 5, స్టార్క్‌ (సి)డికాక్‌ (బి)జెన్సన్‌ 27, కమిన్స్‌ (సి)మిల్లర్‌ (బి)షాంసీ 22, జంపా (నాటౌట్‌) 11, హేజిల్‌వుడ్‌ (సి)రబడా (బి)షాంసీ 2, అదనం 17. (40.5ఓవర్లలో ఆలౌట్‌) 177పరుగులు.

వికెట్ల పతనం : 1/27, 2/27, 3/50, 4/56, 5/65, 6/70, 7/139, 8/143, 9/175, 10/177

బౌలింగ్‌ : ఎన్గిడి 9-2-18-1, జెన్సన్‌ 7-0-54-2, రబడా 8-1-33-3, మహరాజ్‌ 10-0-30-2, షాంసీ 7.5-0-16-2.