
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 199 పరుగులకు అలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(46), వార్నర్ 41, స్టార్క్ 28, లబుషేన్ 27 మాత్రమే మెరుగైన ప్రదర్శన చేశారు. 6 బంతులు ఆడిన మిచెల్ మార్ష్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 52 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు.41 బంతుల్లో ఓ ఫోర్‌తో 27 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. రెండు బంతులాడిన అలెక్స్ క్యారీ డకౌట్ అయ్యాడు. 25 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కామెరూన్ గ్రీన్‌ని రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. 20 బంతుల్లో 8 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, అశ్విన్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 20 బంతుల్లో 6 పరుగులు చేసిన ఆడమ్ జంపా, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసి ఔటాయ్యడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, కుల్దీప్ తలా రెండు వికెట్లు సాధించారు. సిరాజ్, అశ్విన్, హార్దిక్ చెరో వికెట్ సాధించారు.