Jun 08,2023 13:28

ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ (గుంటూరు) : తెనాలి మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా అత్తోట నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ గురువారం ప్రకటించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పట్టణ వైసిపి కౌన్సిలర్లు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంతకు పూర్వం వైస్‌ చైర్మన్‌గా కొనసాగిన గుంటూరు కోటేశ్వరరావు పదవీ కాలం పూర్తవ్వడంతో 40వ వార్డు కౌన్సిలర్‌ అత్తోట నాగవేణికు వైస్‌ చైర్పర్సన్‌ పదవి దక్కింది. మున్సిపల్‌ కమీషనర్‌ ఎం.జస్వంతరావు సమక్షంలో ఆమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, చైర్పర్సన్‌ సయ్యద్‌ ఖాలేదా నసీమ్‌, వైస్‌ చైర్మన్‌ మాలేపాటి హరి ప్రసాద్‌, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన వైస్‌ చైర్మన్‌ నాగవేణికు శుభాకాంక్షలు తెలిపారు.