Jul 10,2023 11:29

చైనా : చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులో దారుణం జరిగింది. ఓ కిండర్‌గార్టెన్‌లోకి ప్రవేశించిన 25 ఏళ్ల యువకుడు ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురిని కత్తితో పొడిచి చంపేశాడు. మృతుల్లో ఒక టీచర్‌, ఇద్దరు పేరెంట్స్‌, ముగ్గురు విద్యార్థులు ఉన్నారని, మరో వ్యక్తి గాయపడ్డాడని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.40 గంటల సమయంలో ఈ ఘటన. చోటు చేసుకుంది. ఆ వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైనట్లు తెలిపారు.