విజయవాడ : విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. తల్లీపిల్లల హాస్పిటల్‌లో ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఈ నెల 8వ తేదీన కంకిపాడు నుంచి డెలివరీ నిమిత్తం గంగా భవాని అనే మహిళ హాస్పిటల్‌లో చేరింది. అదే రోజు కాన్పు అయ్యింది. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ఒక బిడ్డకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఐసీయూలో.. మరో బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని తల్లి వద్ద ఉంచారు. శుక్రవారం పాలు పట్టించాలని తల్లి వద్ద ఉన్న పాపను ఆసుపత్రి సిబ్బంది తీసుకెళ్లింది.
కొద్దిసేపటికే బేబీ చనిపోయాయిందంటూ తల్లిదండ్రులకు సిబ్బంది సమాచారం ఇచ్చింది. మృతి చెందిన బేబీ .. తమ బేబి కాదంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు. చనిపోయిందని చెప్పిన బేబీకి రెండు టాగ్స్ ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పుట్టింది అమ్మాయి అని.. అయితే చనిపోయిన పాప బాడీకి అబ్బాయి ట్యాగ్ ఉందని చెబుతున్నారు. పాప వద్ద సిబ్బంది ఫింగర్ ప్రింట్ తీసుకోలేదని.. కానీ చనిపోయిన బేబికి ఫింగర్ ప్రింట్ తీసుకున్నట్టు ఆనవాళ్లున్నాయని చెబుతున్నారు. సిబ్బంది ప్రవర్తన పట్ల కూడా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.