హైదరాబాద్ : బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీ వద్ద ఓ బాలుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాలో కొట్టుకుపోయిన ఐదేళ్ల బాలుడు మిథున్.. నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప వద్ద తేలాడు. అప్రమత్తమైన స్థానికులు, డీఆర్ఎఫ్ బృందాలు బాలుడిని బయటకు తీసేందుకు యత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలం కావడంతో, బాలుడు మళ్లీ చెరువులోకి కొట్టుకుపోయాడు. దీంతో బాలుడి ఆచూకీ కోసం ప్రగతి నగర్ తురక చెరువులో డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గాలింపు చర్యలను కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పరిశీలించారు. బాలుడు నాలాలో పడిపోతున్న సీసీటీవీ ఫుటేజీ లభ్యమైంది. మిథున్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.