విశాఖ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొడదాం... అంటూ... చలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుండి కార్మిక, కర్షక సంఘాలు సోమవారం బయలుదేరాయి. విశాఖపట్నం రైల్వేస్టేషన్ వద్ద కార్మికులు, అన్నదాతలు, ప్రజా సంఘాల నేతలు భారీగా చేరుకున్నారు. చలో ఢిల్లీ జయప్రదం కోరుతూ నినాదాలు చేశారు.










