న్యూఢిల్లీ : 5 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం లక్ష్యాలను చేధించే అణు సామర్థ్యం గల అగ్ని 5 బాలిస్టిక్ క్షిపణి రాత్రి సమయంలో పరీక్షలనూ (నైట్ ట్రయిల్స్) భారత్ విజయవంతంగా పూర్తిచ ేసింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. క్షిపణిలోని నూతన సాంకేతికలు, పరికరాలను ధృవీకరించడానికి ఈ పరీక్ష నిర్వహించబడిందని, అలాగే, ఈ పరీక్షతో మరింత దూరంలో ఉన్న లక్ష్యాలను అగ్ని 5 చేధించగలదని రుజువయిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ పరీక్ష జరిగింది. 2012లో అగ్ని 5ను తొలిసారి పరీక్షించిన తరువాత ఈ క్షిపణికి ఇది తొమ్మిదో పరీక్ష. సాధారణ పరీక్షల్లో భాగంగానే తాజా పరీక్ష జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా పరీక్ష విజయంతో భారత దేశ యొక్క వ్యూహాత్మక దళ కమాండ్‌లో అగ్ని 5 చేరడానికి సిద్ధంగా ఉంది. అలాగే 5 వేలకు కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించే అగ్ని 5 పరీక్ష విజయంతం కావడంతో ఖండాతర బాలిస్టిక్ క్షిపణి భారత్‌కు అత్యవసరం కాదు.