Nov 22,2023 10:45

న్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికపై మనీ లాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా అసోసియేటెడ్‌ జర్నల్స్‌కు చెందిన రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మంగళవారం అటాచ్‌ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ప్రచురణకర్త, అసోసియేటెడ్‌ జర్నలిస్ట్‌పై మనీలాండరింగ్‌ నిరోధక కేసు కింద తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇడి తెలిపింది. 2013లో బిజెపి నేత సుబ్రమణ్య స్వామి ఢిల్లీ కోర్టులో వేసిన ప్రైవేట్‌ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. వార్తాపత్రికను స్వాధీనం చేసుకోవడంలో గాంధీల తరపున నిధులు దుర్వినియోగం జరిగాయన్నది ఫిర్యాదీదారుని వాదన. ఈ కేసులో 2015 డిసెంబరులో సోనియా, రాహుల్‌లకు ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.