- కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్..
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (వైపిపి)కి సంబంధించిన నిబంధనలను సవరించింది. సవరించిన విధానం ప్రకారం... కంటెంట్ క్రియేటర్‌లకు ఇప్పుడు 500 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉంటే వైపీపీలో చేరిపోవచ్చు. ఇప్పటిదాకా వెయ్యి సబ్‌స్క్రైబర్‌లు ఉంటే తప్ప ఈ అవకాశం లభించేది కాదు. అంతేకాదు గతంలో 4 వేల వాచ్ అవర్స్, 10 మిలియన్ల వ్యూస్‌కు బదులు ఇపుడు మూడు మిలియన్ల వ్యూస్ లేదా 3 వేల వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. క్రియేటర్లకు మానిటైజేషన్ అవకాశాలను విస్తరించాలనే యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చిన్న క్రియేటర్లు సైతం మానిటైజేషన్ టూల్స్‌ను పొందేందుకు వీలుగా ఈ నిబంధనలను మార్చడంతో ఇకపై తక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న క్రియేటర్లు సైతం యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చు.. భారత్‌లో ఈ నిబంధన ఎప్పటినుంచి వర్తించేది స్పష్టత లేనప్పటికీ.. ఈ నిబంధనలు ప్రస్తుతం యూఎస్, యూకే, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తాయని ది వెర్జ్ నివేదించింది.