ముంబయి : ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అశ్విన్ డాని కన్నుమూశారు. కంపెనీ నలుగురు సహ వ్యవస్థాపకుల్లో ఆయన ఒక్కరు. డాని మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు కంపెనీని నూతన శిఖరాలకు తీసుకెళ్లారు. 79 ఏళ్ల అశ్విన్ డాని మరణించడంతో గురువారం ఆ కంపెనీ షేర్లు 4 శాతం మేర నష్టపోయాయి.