Aug 29,2023 16:51

ఆసియా కప్‌కు ముందు భారత క్రికెట్‌ జట్టుకు షాక్‌ తగిలింది. భారత స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌.. ఆసియా కప్‌లో భాగంగా భారత్‌ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌, నేపాల్‌తో రెండో మ్యాచ్‌ ఆడనుంది. కేఎల్‌ రాహుల్‌ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదనే విషయాన్ని బిసిసిఐ వెల్లడించింది. గాయంతో జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ మెరుగైనా.. వంద శాతం ఫిట్‌నెస్‌ సాధించలేదని హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ తెలిపాడు. పాకిస్తాన్‌, నేపాల్‌ జట్లతో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్‌ అందులో ఉండడని ఆయన తెలిపారు. దీంతో కెఎల్‌ రాహుల్‌ తర్వాత బయల్దేరివెళ్లి జట్టుతో కలువనున్నారు.