Aug 30,2023 10:40
  • పాక్‌-నేపాల్‌ మ్యాచ్‌తో షురూ
  • మధ్యాహ్నం 3.00గం||ల నుంచి

లాహోర్‌: ఆసియాకప్‌ క్రికెట్‌ పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పాకిస్తాన్‌, నేపాల్‌జట్ల మధ్య ముల్తాన్‌ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో 2023 ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌ ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నీలో భద్రతా కారణాలవల్ల భారతజట్టు పాక్‌లో పర్యటించేందుకు నిరాకరించడంతో శ్రీలంక, పాకిస్తాన్‌ కలిసి సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా శ్రీలంక జట్టు బరిలో దిగుతోంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే మొత్తం ఆరుజట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్‌ ఉన్న గ్రూప్‌లోనే పాకిస్తాన్‌ జట్టు కూడా ఉంది. లీగ్‌ దశ ముగిసిన తర్వాత సూపర్‌-4 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ప్రతి గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా రెండుజట్లతో ఒక్కోసారి తలపడి టాప్‌-2లో ఉన్న రెండుజట్లు సూపర్‌-4కు చేరనున్నాయి. సూపర్‌-4లోనూ
ఆగస్టు 30 నుంచి పాకిస్థాన్‌, శ్రీలంక వేదికగా ఆసియా కప్‌ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు ఈ టోర్నీని 15 సార్లు నిర్వహించగా.. అత్యధికంగా భారత్‌ ఏడుసార్లు విజేతగా నిలిచింది. ఆసియా కప్‌ను 2016, 2022 సంవత్సరాల్లో టీ20 ఫార్మాట్‌లో మిగతా అన్ని సీజన్లలో వన్డే ఫార్మాట్‌లో టోర్నీని నిర్వహించారు. ఈ సారి ఆసియా కప్‌ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. మరి ఆసియా కప్‌ (వన్డే ఫార్మాట్‌)లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లెవరు, ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఎవరో తెలుసుకుందాం. సెప్టెంబర్‌ 9 నుంచి సూపర్‌-4 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇక సెప్టెంబర్‌ 17న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఆసియాకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.
గ్రూప్‌-ఏ : భారత్‌, పాకిస్తాన్‌, నేపాల్‌
గ్రూప్‌-బి : శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌

షెడ్యూల్‌..
30(బుధ) : పాకిస్తాన్‌ × నేపాల్‌
31(గురు) : బంగ్లాదేశ్‌ × శ్రీలంక
సెప్టెంబర్‌ 2(శని) : పాకిస్తాన్‌ × భారత్‌
2(ఆది) : బంగ్లాదేశ్‌ × ఆఫ్ఘనిస్తాన్‌
4(సోమ) : భారత్‌ × నేపాల్‌
5(మంగళ) : ఆఫ్ఘనిస్తాన్‌ × శ్రీలంక
సూపర్‌-4 మ్యాచ్‌లు..
6(బుధ) : ఎ1 × బి2
9(శని) : బి1 × బి2
10(ఆది) : ఎ1 × ఎ2
12(మంగళ) : ఎ2 × బి1
14(గురు) : ఎ1 × బి1
15(శుక్ర) : ఎ2 × బి2
17(ఆది) : ఫైనల్‌