Aug 30,2023 16:26
  • నేపాల్‌పై 238పరుగుల తేడాతో పాకిస్తాన్‌ గెలుపు

ముల్తాన్‌: ఆసియా కప్‌ 2023లో పాకిస్తాన్‌ జట్టు 238పరుగుల తేడాతో నేపాల్‌పై గెలిచింది. గ్రూప్‌-ఏలో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(151), ఇప్తికార్‌(109నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కారు. 124పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పాక్‌ను బాబర్‌-ఇప్తికార్‌ కలిసి 5వ వికెట్‌కు 218పరుగులు జతచేశారు. ఛేదనలో నేపాల్‌ జట్టు 23.4ఓవర్లలో 104పరుగులకు ఆలౌటైంది. షాదాబ్‌కు నాలుగు, షాహిన్‌, రవూఫ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బాబర్‌కు లభించగా.. నేడు శ్రీలంక-బంగ్లాదేశ్‌ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.