Oct 11,2023 22:15

భువనేశ్వర్‌: 6వ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గనే భారత మహిళల జట్టును హాకీ ఇండియా(హెచ్‌ఐ) బుధవారం వెల్లడించింది. హాకీ ఇండియా ప్రకటించిన 20మంది ఆటగాళ్లతో కూడిన జట్టుకు గోల్‌ కీపర్‌ సవిత పునియా కెప్టెన్‌, డీప్‌ గ్రేస్‌ ఎక్కా వైస్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌తోపాటు జపాన్‌, చైనా, కొరియా, మలేషియా, థారులాండ్‌ జట్లు పాల్గోనున్నాయి. మొత్తం 6జట్ల ఉన్న పూల్‌ లీగ్‌లో ఒక్కో జట్టు మిగిలిన ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడనుంది. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో సవిత నేతృత్వంలోని భారత మహిళలజట్టు కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక బ్యాకప్‌ ప్లేయర్స్‌గా షర్మిలా దేవి, విఠల్‌ ఫల్కేలకు చోటు దక్కింది. భారత్‌ ఆతిథ్యమిచ్చే ఈ టోర్నమెంట్‌ ఈనెల 27నుంచి నవంబర్‌ 5వరకు జరగనుండగా... టీమ్‌ కోచ్‌గా జన్నెకే స్కోప్‌మన్‌ వ్యవహరించనున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన జపాన్‌ జట్టు తన తొలి లీగ్‌ మ్యాచ్‌ను కొరియాతో తలపడనుండగా.. కొరియా జట్టు 2010, 2011, 2016లలో టైటిల్‌ విజేతగా నిలిచింది.
జట్టు...
గోల్‌కీపర్స్‌: సవిత(కెప్టెన్‌), బిఛూ దేవి ఖరిబన్‌
డిఫెండర్లు: నిక్కీ ప్రధాన్‌, ఉదిత, ఇషికా చౌదరి, డీప్‌ గ్రేస్‌ ఎక్కా(వైస్‌ కెప్టెన్‌)
మిడ్‌ఫీల్డర్లు: నిషా, సలీమా తెతె, నేహా, నవ్‌నీత్‌ కౌర్‌, సోనికా, మౌనిక, జ్యోతి, బల్జీత్‌ కౌర్‌
ఫార్వర్డ్స్‌: లాల్‌రెమిసిమి, సంగీత కుమారి, దీపిక, వందన కటారియా
బ్యాకప్‌ ప్లేయర్స్‌: షర్మిలా దేవి, వైశాలి విఠల్‌
షెడ్యూల్‌..
28(శని) : భారత్‌ × మలేషియా
30(సోమ) : భారత్‌ × చైనా
31(మంగళ) : భారత్‌ × జపాన్‌,
నవంబర్‌ 2 : భారత్‌ × కొరియా
4(శని) : సెమీఫైనల్స్‌
5(ఆది) : ఫైనల్‌