Jun 25,2023 09:58

ఆషాడం వచ్చిందంటే వానలతో పాటు గోరింటాకు కూడా గుర్తొస్తుంది. నగరాల మాట అలా వుంచితే పొలం పనులు చేసుకునేవారు ఈ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఎంతో ఇష్టంగా పెట్టుకునే ఈ గోరింటాకు అందంతో పాటు ఆరోగ్యానికి కూడా పెద్ద పీట వేస్తుంది.

  • ఈ కాలంలో తరచూ వచ్చే చర్మవ్యాధులు రాకుండా, గోళ్లు దెబ్బతినకుండా గోరింటాకు బాగా ఉపయోగపడుతుంది.
  • వేసవి వేడి నుండి వర్షాకాలం ప్రారంభమైన ఈ వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు వల్ల శరీరంలో 'కఫ' సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు గోరింటాకు చాలా బాగా పనిచేస్తుంది.
  • గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసు బారి పోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
  • గోరింట ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధాలుగా పనిచేస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
  • గోరింటలో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. మార్కెట్లో దొరికే కృత్రిమ రసాయనాలతో తయారైన కోన్లను పెట్టుకోవడం వల్ల గోరింటాకు ప్రయోజనాలు లభించవు. కాబట్టి సహజంగా దొరికే గోరింటాకునే ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.