ప్రజాశక్తి-చాగల్లు (ఏలూరు) : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద మంగళవారం ఆశ వర్కర్స్ నిరసన తెలిపారు. ముందుగా చాగల్లు మెయిన్ బజార్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండలకార్యదర్శి కేకే దుర్గారావు మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల నియమాకంలో రాజకీయ జోక్యం తొలగించాలన్నారు. ప్రభుత్వమే నియామకాలు జరపాలని పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సెలవులు రిటైర్మెంట్ మొదలగు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా ప్రెసిడెంట్ జి.వెంకటలక్ష్మి, పి.వెంకటలక్ష్మి, మంగతాయారు, లక్ష్మి, సిఐటియు మండల నాయకులు ఎస్‌కె.ఆదం, రైతు నాయకులు గారపాటి వెంకట సుబ్బారావు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










