
న్యూఢిల్లీ: ఐసిసి వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసునుంచి నిష్క్రమించిన శ్రీలంకాబంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్ల హవా కొనసాగింది. అరుణ్‌జైట్లీ మైదానంలో సోమవారం తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ బ్యాటర్ అసలంక 105బంతుల్లో 108 పరుగులు చేశాడు. అసలంక ఇన్నింగ్స్‌లో 6ఫోర్లు, 5సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక(41), సమరవిక్రమ(41), ధనంజయ డిసిల్వా(34), మహీశ్ తీక్షణ(22) బ్యాటింగ్‌లో రాణించారు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా(4), కెప్టెన్ కుశాల్ మెండిస్(19) విఫలమయ్యారు. సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ రూపంలో వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తాంజిమ్ హసన్‌కు మూడు, కెప్టెన్ షకిబ్ అల్ హసన్, షోరిఫుల్ ఇస్లామ్‌కు రెండేసి, మెహిదీ హసన్‌కు ఒక వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు...
శ్రీలంక ఇన్నింగ్స్: నిస్సంక (బి)తంజిమ్ హసన్ 41, కుశాల్ పెరీరా (సి)ముస్తాఫిజుర్ (బి)షోరిఫుల్ 4, కుశాల్ మెండీస్ (సి)షోరిఫుల్ (బి)షకీబ్ 19, సమరవిక్రమ (సి)మహ్మదుల్లా (బి)షకీబ్ 41, అసలంక (సి)లింటన్ దాస్ (బి)తంజిమ్ హసన్ 108, మాధ్యూస్ (టైమ్డ్ ఔట్) 0, ధనుంజయ (స్టంప్)ముష్ఫికర్ (బి)మెహిదీ హసన్ 34, తీక్షణ (సి)నసుమ్ అహ్మద్ (బి)షోరిఫుల్ 22, ఛమీర (రనౌట్)ముస్తాఫిజుర్ 4, రజిత (సి)లింటన్ దాస్ (బి)తంజిమ్ హసన్ 0, దిల్షాన్ మధుశంక (నాటౌట్) 0, అదనం 8.
వికెట్ల పతనం: 1/5, 2/66, 3/72, 4/135, 5/135, 6/213, 7/258, 8/278, 9/278, 10/279
బౌలింగ్: షోరిఫుల్ 9.3-0-52-2, తస్కిన్ అహ్మద్ 10-1-39-0, తంజుమ్ హసన్ 10-0-80-3, షకీబ్ 10-0-57-2, మెహిదీ హసన్ 10-0-49-1.