Dec 27,2022 15:37

న్యూఢిల్లీ : చలికి ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోవడంతో అక్కడి ప్రజలు చలి తీవ్రతను తట్టుకోలేక వణికిపోతున్నారు. ఇక మంగళవారం రాష్ట్రాల వారీగా ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని లేV్‌ా పట్టణంలో 11 డిగ్రీల సెల్సియన్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే లడఖ్‌లోని పర్వత ప్రాంతమైన డిస్కిట్‌ నుబ్రాలో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కార్గిల్‌లో 9.7 డిగ్రీలు నమోదైంది. ఇక శ్రీనగర్‌లో కనీస ఉష్ణోగ్రత 4.8 డిగ్రీలు, జమ్మూ నగరంలో 2.5 డిగ్రీలు నమోదయ్యాయి. కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతమైన పహల్గామ్‌లో 6.7 డిగ్రీలు, గుల్మార్గ్‌లో 5.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్‌లోని చురులో అత్యల్ప ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియన్‌గా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫుర్సత్‌గంజ్‌లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని బార్కోట్‌ 1.5 డిగ్రీలుగా ఉంది. ఢిల్లీలో 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధానిలో అయానగర్‌ పట్టణంలో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవవ్వడంతో అక్కడ చలి ఎక్కువగా ఉంది.