ఇంటర్నెట్‌డెస్క్ : చలికాలంలో కీళ్లనొప్పులు వేధిస్తాయి. ఈ కాలంలో ఉదయం పూట నొప్పులు మరీ ఎక్కువగా ఉంటాయి. దీంతో నడవలేక చాలా ఇబ్బందులు పడతారు. మరి ఈ కాలంలో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- చలికాలంలో శరీరానికి కావలసినంత సూర్యరశ్మి అందదు. దీంతో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
- సల్ఫర్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
- శీతాకాలంలో నీటిని ఎక్కువగా తీసుకోము. దీంతో శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. అలా కాకుండా ముందుజాగ్రత్తగా తగినంత నీటిని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డీ హైడ్రేషన్‌కు గురవ్వడం వల్ల కూడా కీళ్లనొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ప్రతిరోజూ వ్యాయమం చేయడం వల్ల కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.