Dec 27,2022 18:10
  • 50 అంగుళాల మంచులో కూరుకుపోయిన బఫెలో ప్రాంతం
  • గడ్డ కట్టిన నయాగారా జలపాతం

బఫెలో, న్యూయార్క్‌ : అమెరికాలో మంచు తుపాను తీవ్రత ఏ మాత్రమూ తగ్గలేదు. రోజుల తరబడి కుటుంబాలు మంచులో చిక్కుకుపోవడంతో ప్రజల ఇబ్బందులు చెప్పనలవి కాకుండా వునాుయి. ఇప్పటికే మంచు తీవ్రతకు మరణించిన వారి సంఖ్య 50దాటింది. న్యూయార్క్‌ రాష్ట్రంలో పరిస్థితి మరీ దారుణంగా వుందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని లేక్‌సైడ్‌ కౌంటీలోనే అతిపెద్ద నగరమైన బఫెలో మేయర్‌ బిరాన్‌ బ్రౌన్‌ ట్వీట్‌ చేశారు. బఫెలో ఏరియా మరింత మంచులో కూరుకుపోయిందని అన్నారు. దాదాపు 50 అంగుళాల మందాన మంచు పేరుకుపోయింది. గత ఐదు రోజుల నుండి ఇక్కడ జన జీవనం స్తంభించిపోయింది. ఇక్కడ పరిస్థితి యుద్ధరంగంలో మాదిరిగా వుందని న్యూయార్క్‌ రాష్ట్ర గవరుర్‌, బఫెలో వాసి కేథీ హోచుల్‌ వ్యాఖ్యానించారు. ఈ శతాబ్దంలోనే ఇది అతిపెద్ద మంచు తుపానుగా ఆయన పేర్కొనాురు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో హైవేలపై చిక్కుకుపోయిన వారిని కాపాడడం కూడా కష్టంగా మారింది. మంచు తుపాను ధాటికి సహాయక సిబ్బంది మంచును పెకిలించే కార్యకలాపాలు కూడా చేపట్టలేకపోతునాురు. దీంతో కొనిు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా వుంది. అంబులెన్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. కార్యాలయానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ కారులో మంచులో 18గంటలకుపైగా చిక్కుకుపోయి 22ఏళ్ళ యువతి ఆండెల్‌ టేలర్‌ మరణించింది. ఆమె పంపిన వీడియోను ఆమె సోదరి పోస్టు చేశారు.

  • పాక్షికంగా గడ్డ కట్టిన నయాగారా !

మంచు తుపాను కారణంగా నయాగారా జలపాతం పాక్షికంగా గడ్డ కట్టింది. ఇందుకు సంబంధించి వీడియోలు, పోస్టులు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే సెకనుకు 3160 టన్నుల మొత్తంలో నీరు ప్రవహిస్తున్న కారణంగా, సెకనుకు 32 అడుగుల వేగంతో నీరు కిందపడుతూ వుంటునుందున మొత్తంగా జలపాతం గడ్డ కట్టే అవకాశం లేదు.