న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండిస్టీస్ తాజాగా అర్వింద్ ఫ్యాషన్స్‌కు చెందిన కాస్మోటిక్స్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల విభాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ డీలు విలువ రూ.216 కోట్లుగా ఉన్నట్లు రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ లిమిటెడ్ సొంతం చేసుకుందని పేర్కొంది. కొనుగోలు ప్రక్రియ పూర్తయితే తమ వాటాలన్నీ రిలయన్స్ రిటైల్ చేతుల్లోకి వెళ్లిపోతాయని అర్వింద్ ఫ్యాషన్స్ తెలిపింది.