ఎఐ నిపుణుడు జాఫ్రె హింటన్
న్యూఢిల్లీ : కృత్రిమ మేధాతో మానవాళికి ముప్పు పొంచి ఉందని ఎఐ గాడ్‌ఫాదర్, గూగల్ మాజీ పరిశోధకుడు జాఫ్రె హింటన్ హెచ్చరించాడు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే 5 నుంచి 20 ఏళ్లలో ఎఐతో పనుల తీరు పూర్తిగా మారొచ్చన్నారు. మనుషులు చేసే పనులను ఎఐ తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. ఎఐ టూల్స్ అన్ని నవలలను చదవడం ద్వారా అది మనుషులను ఒప్పించడంలో సమర్ధవంతంగా వ్యవహరిస్తుందని విశ్లేషించారు. రోబోట్‌లకు అన్నీ తెలుసని, ఏ పనులు ఎలా చక్కబెట్టాలో తెలుసునని హింటన్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు విసిరే సవాల్ కంటే ఎఐతోనే మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. దీనిపై పాలకలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.