బిల్లులు చెల్లించకుంటే 27 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం : ఎపి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆరోగ్యశ్రీ సేవల కింద ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులను విడుదల చేయకుంటే ఈ నెల 27 నుంచి ఆరోగ్యశ్రీ కింద సేవలను నిలిపేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది. వెంటనే బిల్లులు చెల్లించాలని వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శికి అసోసియేషన్ అధ్యక్షులు మురళీకృష్ణ సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు.