ముంబయి : డిగ్జాన్, ఇతర సంస్ధలతో భాగస్వామ్యం ద్వారా వినియోగదారుల గృహోపకరణాల ఉత్పత్తులను విడుదల చేసినట్లు ఆర్జూ తెలిపింది. కన్స్యూమర్ డ్యూరెబుల్ వేదిక అయినా అర్జు ఇప్పుడు స్మార్ట్ శ్రేణీ గృహోపకరణాల నిర్మాణంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. ఈ భావితరపు ఉత్పత్తులు నూతన తరపు సాంకేతికతలు, అత్యున్నత నాణ్యత, డిజైన్లతో తీర్చిదిద్దబడ్డాయని ఆర్జూ సిఇఒ, కో ఫౌండర్ ఖుష్నుద్ ఖాన్ పేర్కొన్నారు. తాము ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తయారీలోని కీలక డిగ్జాన్, అంబర్ సహా పలు గ్రూప్‌లతో భాగస్వామ్యం చేసుకుందన్నారు.










