Apr 08,2023 21:25

హైదరాబాద్‌ : రస్నా గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ దివంగత అరీజ్‌ పిరోజ్‌ షా ఖంబాటాకు ఎట్టకేలకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఆయన మరణాంతరం ఈ అవార్డు పొందారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో ఆయన సేవలకు గాను ఈ అవార్డు పిరోజ్‌ తరఫున ఆయన భార్య పెర్సిస్‌ అరీజ్‌ ఖంబాటా, కుమారుడు పిరుజ్‌ అరీజ్‌ ఖంబాటా రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.