Jan 28,2023 17:12
  • తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ కైవసం

మెల్బోర్న్‌ : బెలారస్‌కు చెందిన ఐదో సీడ్‌ క్రీడాకారిణి అరినా సబలెంకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మెల్బోర్న్‌లో నేడు జరిగిన ఫైనల్లో సబలెంకా 4-6, 6-3, 6-4తో 22వ సీడ్‌ ఎలెనా రైబాకినాపై విజయం సాధించింది. మొదటి సెట్‌లో 4-6తో వెనుకబడిన సబలెంకా తర్వాతి రెండు సెట్‌లలో పుంజుకుని తొలి సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు, ఆమె 2021లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను గెలుచుకుంది. 2019 యుఎస్‌ ఓపెన్‌లో డబుల్స్‌ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవడంతో సబలెంకా ప్రపంచ మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో రెండోస్థానానికి ఎగబాకింది.

Your #AO2023 women’s singles champion, @SabalenkaA 🙌@wwos@espn@eurosport@wowowtennis#AusOpen pic.twitter.com/5ggS5E7JTp