May 24,2023 10:26

ఈ కాలంలో శరీరంలో అధిక వేడి కారణంగా సెగ్గడ్డలు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పి, బాధ ఉంటుంది. చాలా మంది ఈ బాధను తట్టుకోలేక పోతుంటారు. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా వచ్చే వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించాలి.

సెగ్గడ్డలు రాకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉండే పండ్లను రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బాక్టీరియా తగ్గుతుంది.
రోజుకు 3 లీటర్ల మంచి నీరు తప్పనిసరిగా తాగాలి. కొబ్బరి నీళ్లు, జ్యూసులు, కూరగాయల రసాలను సేవించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్ళి పోతాయి. రక్తం శుద్ధి జరుగుతుంది. తద్వారా సెగ్గడ్డలు రాకుండా చూసుకోవచ్చు.
తొక్క తీసిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు, అరస్పూన్‌ వాము కలిపి మెత్తని పేస్ట్‌గా చేయాలి. ఈ పేస్ట్‌ని సెగ్గడ్డలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఒక గిన్నెలో రెండు స్పూన్ల బియ్యంపిండి వేసి దానిలో నీటిని కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడ
సెగ్గడ్డలపై రాయాలి. పూర్తిగా ఆరనివ్వాలి అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
కలబంద జెల్‌లో కొద్దిగా పసుపు కలిపి. గడ్డలపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లని వాటర్‌తో శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బంగాళాదుంప పైతొక్కను తొలగించి, గ్రైండ్‌ చేసి, రసాన్ని తీయాలి. ఒక కాటన్‌ క్లాత్‌ సహాయంతో సెగ్గడ్డలు ఉన్న ప్రాంతంలో ఈ బంగాళాదుంప రసాన్ని రాయాలి. ఆరిపోయిన తరువాత చల్లటి నీటితో
శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నానబెట్టిన మెంతులను పేస్ట్‌గా చేసి ఆపేస్ట్‌ను సెగ్గడ్డలపై అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల గడ్డ త్వరగా పగిలిపోతుంది. అందులో ఉండే చీము బయటకు వచ్చి ఉపశమనం కలుగుతుంది.