ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, విశాలాంధ్ర దినపత్రిక సంయుక్తంగా యువ కవులకు వచన కవితా పోటీలు నిర్వహిస్తున్నామని అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్తమాన రాజకీయ సామజిక అంశాలపై 30 పంక్తులకు మించని కవితలు, ఒకరు ఒకటి మాత్రమే ఏప్రిల్ 27 లోగా పంపాలని, కవుల వయసు 30 సంవత్సరాలు మించరాదని, ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ. 1500, 1000, 750 లను అందిస్తారని తెలిపారు. కవితలను పంపాల్సిన చిరునామా : అరసం, 401 శ్రావణి రెసిడెన్సీ, 6/3, ఎస్ వి ఎన్ కాలనీ, గుంటూరు - 522006. ఫోను : 92915 30714










