Sep 04,2023 20:46

హైదరాబాద్‌ : ప్రముఖ వైద్య సేవల చెయిన్‌ అపోలో హాస్పిటల్స్‌ కొత్తగా సమగ్ర అనుసంధానిత సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది ఇది అపోలో కనెక్టెడ్‌ కేర్‌ టెక్నాలజీ ద్వారా రోగి పరిస్థితి ఎప్పటికప్పుడూ తెలుసుుకోవడానికి వీలుంటుందని ఆ సంస్థ పేర్కొంది. అత్యవసర అంబులెన్స్‌, ఇన్‌ పేషెంట్‌, పోస్ట్‌ సర్జరీ, ఇంట్లో సంరక్షణ వంటి రోగి ప్రయాణంలో అనేక కేర్‌ టచ్‌ పాయింట్‌లలో క్లినికల్‌ టీమ్‌లు, నర్సింగ్‌ సిబ్బందికి రోగి సంపూర్ణ సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. ''కేర్‌ డెలివరీ మొత్తం నమూనా మారుతోంది. వైద్య నిపుణులు, రోగులు పరస్పరం వ్యవహరించే తీరు, ప్రతి టచ్‌ పాయింట్‌ వద్ద సంరక్షణను అందించే అవకాశాలను విస్తరించింది. దీంతో రోగులు మెరుగైన ఆరోగ్య ఫలితాలను పొందగలుగుతారు. వైద్యులు నిరంతర సంరక్షణను అందించగలరు. రోగుల భద్రతను మెరుగుపరచడం, క్లినికల్‌ ఫలితాలను మెరుగు పరిచే కనెక్ట్‌ చేయబడిన ఆరోగ్య వ్యవస్థను నిర్మించడాన్ని కొనసాగిస్తాం'' అని అపోలో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీత రెడ్డి పేర్కొన్నారు.