న్యూఢిల్లీ : గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఇండో అమెరికన్ అపర్ణ చెన్నప్రగడ నియమితులయ్యారు. ఆమెకు కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ విభాగం బాధ్యతలు అప్పగించారు. ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన అపర్ణకు ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డిజైన్, స్ట్రాటజీ విభాగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గూగుల్‌లో ఆమె 12 ఏళ్లు పని చేశారు. ఎఐలో గూగుల్, మైక్రోసాఫ్ట్ మధ్య నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో అపర్ణకు కీలక బాధ్యతలను అప్పగించడం విశేషం.